ఏ పి ముఖ్యమంత్రిని కలిసిన కమల్
- November 12, 2015
విలక్షణ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారు చంద్రబాబు నాయుడిని కలిసారు. భేటీ అనంతరం కమల్ మాట్లాడుతూ...తన అప్ కమింగ్ మూవీ 'చీకటి రాజ్యం ' ప్రీమియర్ షో ను విజయవాడలో ప్రదర్శించేందుకు అనుమతి కోసం చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. అలాగే చీకటిరాజ్యం చిత్రాన్ని చూడాల్సిందిగా ఆయనను కోరినట్టు కమల్ వెల్లడించారు. తన విజ్ఞప్తిని చంద్రబాబు సంతోషంగా అంగీకరించారన్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్ షోలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆరుగంటల గ్యాప్ తో రెండు రాష్ట్రాల్లో ఈ షోలను ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా తమిళంలో మంగళవారం రిలీజైన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. కాగా స్వీయ దర్శకత్వంలో ఫ్రెంచ్ థ్రిల్లర్ ..స్లీప్ లెస్ నైట్ సినిమాను కమల్ రీమేక్ చేశారు. కమల్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







