మన కాలపు త్యాగయ్య మంగళంపల్లి ప్రథమ వర్ధంతి నేడు...!!
- November 22, 2017
ఏ వేదిక మీదనున్నా చెరగని చిరునవ్వు... మధుర కంఠస్వరం, ఎలాంటి క్లిష్టమైన రాగం పడుతున్నా గమకాలు వేస్తున్నా అదే నగుమోము..!! ఎప్పటికీ మరపురాని ఆ నగుమోము మనకి దూరమై ఏడాది అయ్యింది. బాలమురళీకృష్ణ గారు తన 86 ఏట... చెన్నైలో తన నివాసంలో మృతి చెందారు. మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ముద్దుల తనయుడైన బాలమురళికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. 8 వ ఏట కచేరీ చేసిన ఆయన.. కంఠస్వరం నుంచి జాలువారే పాటలు సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేశాయి.
గాయకులుగానే కాకుండా వయొలిన్, మృదంగం తదితర ఇతర సంగీత వాయిద్యాల్లోనూ ప్రావీణ్యత సాధించిన ఘనత ఆయనది. పద్మభూషణ్, డాక్టరేట్ల వంటి బిరుదులను పొందిన ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆలపించిన కీర్తనలు సంగీత ప్రియుల హృదయ కుహరాల్లో నిత్యం ఆ మధుర మోహన మురళీ రవళులు సందడులు చేస్తూనే ఉంటాయి. ఆ ప్రసన్న వదనం మనకీ ప్రసన్న భావాలనే కలిగిస్తూ ఉంటుంది. మన కాలపు త్యాగయ్య మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ప్రథమ వర్థంతి సందర్భంగా నివాళులు. భువన సమ్మోహనకరమైన గానాన్ని మనకి అన్నేళ్లు వినిపించినందుకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







