నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- July 18, 2026
మస్కట్: సముద్రంలో చిక్కుకుపోయిన లేదా దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని నౌకలను 30 రోజుల్లోగా తొలగించాలని వాటి యజమానులకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) ఆదేశాలు జారీ చేసింది.
అల్ సువైక్ విలాయత్ తీరంలోని అల్ జౌద్ ప్రాంతంలో చిక్కుకుపోయిన సీ లైట్ ( SEA LIGHT) నౌకతో పాటు, సూర్ విలాయత్ లోని ఖోర్ అల్-బతా వద్ద చెక్క పడవల నిర్మాణ కేంద్రం సమీపంలో నిలిపివేసిన ఇతర నౌకలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయిని స్పష్టం చేసింది.
నిర్దేశించిన 30 రోజుల గడువులోగా సంబంధిత నౌకలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ యజమానులను కోరింది. ఈ గడువులోగా నౌకలను తొలగించకపోతే, ఒమన్ సముద్ర చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
సముద్ర భద్రతను మెరుగుపరచడం, తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, నౌకాశ్రయాలు మరియు సముద్ర రాకపోకలను సక్రమంగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







