త్వరలో మవసలాత్ ట్యాక్సీ ప్రారంభం
- November 22, 2017
మస్కట్: నేషనల్ బస్ ఆపరేటర్‌మవసలాత్, ట్యాక్సీ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ట్యాక్సీ ఆపరేషన్స్‌కి సంబంధించి తగిన సూచనలు, సలహాలు ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో మవసలాత్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి మవసలాత్, మర్హాబా ట్యాక్సీ లైసెన్సుల్ని పొందాయి. మవసలాత్ ట్యాక్సీ రంగంలోకి వస్తూనే, ఎయిర్‌పోర్ట్ ఛార్జీలను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. జిసిసి దేశాల్లోనే ఒమనీ క్యాపిటల్ వద్ద ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమై, గంటకు 200 బైసాస్‌గా ఉంటున్నాయి. ఇదే జిసిసిలోని ఇతర దేశాల్లో అయితే 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. మోడ్రన్ ట్యాక్సీల్లో వుండే అన్ని అత్యాధునిక సౌకర్యాలూ తమ ట్యాక్సీల్లో ఉంటాయని మవసలాత్ పేర్కొంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







