షేక్‌ ఖాలిద్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఇండియన్‌ ఎంఎంఎ మ్యూనిటీ

- November 23, 2017 , by Maagulf
షేక్‌ ఖాలిద్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఇండియన్‌ ఎంఎంఎ మ్యూనిటీ

మనామా: ఇండియన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కమ్యూనిటీ, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌కి సంబంధించి షేక్‌ ఖాలిద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా అందిస్తున్న ప్రోత్సాహం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఆల్‌ ఇండియా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య పిఎస్‌, బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మిక్‌సడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కమ్యూనిటీకి బహ్రెయిన్‌లోనూ, అలాగే ఇండియలోనూ క్రేజ్‌ పెరుగుతోందనీ, ఈ విషయంలో షేక్‌ ఖాలిద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌, పెద్ద సంఖ్యలో ఇండియన్‌ ఫైటర్స్‌కి ఇంటర్నేషనల్‌ లెవల్‌లో గుర్తింపు తెచ్చిందని చెప్పారు ఆదిత్య. బహ్రెయిన్‌లో తమ కమ్యూనిటీకి దక్కిన గౌరవం ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com