వచ్చే సంవత్సరం నుండి 72 గంటల ట్రాన్సిట్ వీసాకు అనుమతి: ఒమాన్ పర్యాటక శాఖ

- November 12, 2015 , by Maagulf
వచ్చే సంవత్సరం నుండి 72 గంటల ట్రాన్సిట్ వీసాకు అనుమతి: ఒమాన్ పర్యాటక శాఖ

వచ్చే సంవత్సరం నుండి,  ఒమాన్ గుండా ప్రయాణించే వారికీ 72 గంటల ట్రాన్సిట్ వీసాకు అనుమతి ఇవ్వనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీ అహ్మద్ బిన్ నస్సేర్ అల్ మహ్రిజి ప్రకటించారు. విస్తరించబడిన సిటి సెంటర్ మస్కట్ ప్రాజెక్టు పూర్తి అయిన సమాచారాన్ని ప్రకటించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ- ఒమాన్ కు, పర్యాటకులను  ముఖ్యంగా పొరుగు దేశాల నుండి ఆకర్షించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్టు, వచ్చే సంవత్సరం నుండి దీనిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com