మటన్ ఇష్టూ
- November 23, 2017
కావాల్సినవి
మటన్ - 500గ్రా, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు - ఒక్కోటి రెండు చొప్పున, లవంగాలు - ఐదు, అల్లం - చిన్న ముక్క, పచ్చి మిర్చి - మూడు, కొబ్బరి పాలు - రెండు కప్పులు, కొబ్బరి నూనె - ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారివిధానం
ముందుగా మటన్ ముక్కలు ఉడికించాలి. మరొక పాత్రలో బంగాళదుంపలు ఉడికించాలి. పాన్‌లో కొబ్బరినూనె వేడిచేసి లవంగాలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. తరువాత ఉడికించిన బంగాళా దుంపలను మెత్తగా చేసి వేసి, మటన్ ముక్కలను కూడా వేసి కలపాలి. కాసేపు ఉడికాక కొబ్బరిపాలు పోసి కలపాలి. పాలు కొంచెం చిక్కబడ్డాక జీడిపప్పు గ్రైండ్ చేసి వేయాలి. తరువాత ఉప్పు వేసి మరికాసేపు ఉడికించాలి. వేడి వేడిగా తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష