పూజా కార్యక్రమాలు జరుపుకున్న సుధీర్‌బాబు - ఇంద్రగంటి చిత్రం
- November 23, 2017మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్` ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శక నిర్మాతలు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరిగాయి. మణిరత్నం `చెలియా` సినిమాలో నాయికగా నటించి అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ``గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో మా సంస్థలో మేం నిర్మించిన `జెంటిల్‌మేన్` ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సుధీర్‌బాబుగారికి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి నిరవధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం. హైదరాబాద్, హిమాచల్‌ప్రసాద్, ముంబైలోని సరికొత్త లొకేషన్లలో తెరకెక్కిస్తాం`` అని చెప్పారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ``అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది`` అన్నారు.
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్. మనోజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, ప్రొడక్షన్ కంట్రోలర్: చంద్రమోహన్, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!