హిట్ అండ్ రన్: వ్యక్తి అరెస్ట్
- November 23, 2017
మనామా: ట్రాఫిక్ పోలీసులు, తన వాహనంతో ఓ చిన్నారిని ఢీకొట్టి, ఆపకుండా వెళ్ళిపోయిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హిద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు తన వాహనంతో చిన్నారిని ఢీ కొట్టగా, ఆ చిన్నారికి గాయాలయ్యాయి. నిందితుడ్ని అరెస్ట్ చేశామని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ధృవీకరించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. చిన్నారిని తీవ్రంగా గాయపరిచిన ఓ వ్యక్తి వాహనంతో సహా పరారైపోయాడంటూ సోషల్ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. దాంతో ఈ అంశం వైరల్‌గా మారింది. 'బ్లాక్ జపనీస్ - బ్లాక్ ఎస్‌యూవీ వాహనం సైడ్ మిర్రర్ విరిగిపోయింది. బ్లాక్ రిమ్స్ ఆ వాహనానికి ఉన్నాయి. ఎవరైనా ఈ వాహనాన్ని గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలపండి. హిద్‌లో 111 మరియు 109 బ్లాక్స్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. బాధిత చిన్నారి బ్రెయిన్ హేమరేజ్‌కి గురయ్యాడు' అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







