ఫాస్ ఆధ్వర్యంలో ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం
- November 23, 2017
హైదరాబాద్: ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్ సొసైటీ(ఫాస్) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఫాస్ - అక్కినేని, సిల్వర్ క్రౌన్ ఫిలిం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటులు సాయికుమార్‌కు అభినందన పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీ దర్శకురాలు బి జయకు ఫాస్ సిల్వర్‌క్రౌన ఫిలిం అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాట్నా హైకోర్టు పూర్వ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకులకు సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను సన్మానించుకోవడం విశేషం అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పి. విజయబాబు, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సంస్థ నిర్వాహకులు డా. కె ధర్మారావు, సినీనటులు పృథ్వి, ప్రణతి, జయదేవ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష