3 రోజుల దుబాయ్ సూపర్ సేల్ ప్రారంభం
- November 23, 2017
ఈ ఏడాది సెకెండ్ ఎడిషన్ అయిన '3 రోజులు సూపర్ సేల్' షాపింగ్ ప్రియుల్ని అలరించేందుకు వచ్చేసింది. 23 నుంచి 25 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరగనుంది. దుబాయ్ వ్యాప్తంగా పలు మాల్స్, స్టోర్స్ 30 నుంచి 90 శాతం డిస్కౌంట్‌తో షాపింగ్ ప్రియుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వందలాది బ్రాండ్లు ఈ సూపర్ సేల్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. అదీ ఇదీ అని కాదు, అన్ని రకాలైన ఉత్పత్తులూ ఈ సేల్‌లో అతి తక్కువ ధరలకే లభ్యం కానున్నాయి. సౌందర్య సాధనాలు, పాదరక్షలు, వస్త్రాలు, ఇంటీరియర్, ఎలక్ట్రానిక్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులు, ఇలా చాలా ఉత్పత్తులు షాపింగ్ ప్రియుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇండివిడ్యువల్ స్టోర్స్తోపాటుగా డిపార్ట్మెంట్ స్టోర్స్, కంబైన్డ్ స్టోర్స్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత. దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్, దుబాయ్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ సహకారంతో ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







