భగ్గుమంటున్న టమాటో ధర
- November 24, 2017
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. మిజోరాం రాష్ట్రంలో ఏకంగా కిలో టమాట ధర రూ.100లకు చేరుకొంది. ఢిల్లీలో కిలో టమాట రూ.80లకు విక్రయించారు.
టమాట ఎక్కువగా పండించే కర్ణాటక రాష్ట్రంలో కూడ టమాట ధర పెరిగింది. కిలో రూ.జ45 నుండి 50 రూపాయాలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లోని టొమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయిందని అజాద్‌పూర్ మండి టొమాటో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో 90శాతం మేర పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ కారణంగానే ధరలు పెరిగాయని ఆయన చెబుతున్నారు.ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన అజాద్‌పూర్ మండిలో కిలో టొమాటో రూ.40-50 పలుకుతోంది. ఇక రిటైల్‌గా నాణ్యతను బట్టి రూ.70-80కు విక్రయిస్తున్నారు.
ఇక టమాట ఎక్కువగా పండే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడంతో సరఫరాలు తగ్గి ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమాట మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుందని అజాద్‌పూర్ మండీలో టమాట మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







