ఆవపెట్టిన పనసపొట్టు

ఆవపెట్టిన పనసపొట్టు

కావలసిన పదార్థాలు: పనసపొట్టు (రైతు బజార్లలో అమ్ముతారు) - 2 కప్పులు, నువ్వులు -1 టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి -5, ఆవపిండి - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూను, శనగపప్పు - 1 టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - అర కప్పు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు. 
తయారుచేసే విధానం: పనసపొట్టుని మూడొంతులు నీరున్న పెద్ద పాత్రలో వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి. ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి. 3 ఎండుమిరపకాయలను వేగించి, నువ్వులతో పాటు దంచి, పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేగాక ఉడికించిన పనసపొట్టుని కలపాలి. సన్నని సెగమీద నీరంతా ఇగిరిన తర్వాత నువ్వులపొడి మిశ్రమాన్ని కలిపి మరికొంతపేపు వుంచి దించేయాలి. చల్లారిన తర్వాత ఆవపిండి కలిపి, కొత్తిమీర చల్లి (ఘాటు పోకుండా) కాసేపు మూతపెట్టాలి. ఈ కూర కూడా అన్నంతో చాలా బాగుంటుంది. 

Back to Top