'టార్చిలైట్' షూటింగ్ ప్రారంభం
- November 25, 2017
చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి చంద్ర కళ సమర్పణలో 'టార్చిలైట్' చిత్రం షూటింగ్ శనివారం మొదలైంది. సూర్య శ్రీనివాస్, ఆశ్లేష, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వర ప్రసాద్ దర్శకత్వం. ఫిల్మ్ నగర్‌లోని పూజా కార్యక్రమాలు జరుపుకున్న అనంతరం 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా తొలిషాట్‌కు క్లాప్ కొట్టారు. డి.వి. సురేష్ కొండేటి కెమెరా స్విచ్చాన్ చేశారు. గౌరవ దర్శకత్వం సాగర్ వహించారు.
దర్శకుడు వర ప్రసాద్ మాట్లాడుతూ 'ఇది నా 5వ సినిమా. ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా రవి బాబు చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారం నుంచి చిత్ర షూటింగ్ మొదలు కానుంది. వైజాగ్, హైదరాబాద్, శ్రీకాకుళం తదితర పరిసర ప్రాంతాల్లో జరుకోనుంది. సింగిల్ షెడ్యుల్‌లో షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడానికి ప్రయత్నిస్తామ'ని అన్నారు..
హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ 'హారర్ జోనర్ చిత్రమిది. షూట్ త్వరగా పూర్తి చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం' అని చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







