హాంకాంగ్‌ ఓపెన్ ఫైనల్లో సింధు

- November 25, 2017 , by Maagulf
హాంకాంగ్‌ ఓపెన్ ఫైనల్లో సింధు

హైదరాబాదీ స్టార్ షట్లర్ పివి సింధు మరో సూపర్ సిరీస్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సింధు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఈ తెలుగుతేజం 21-17, 21-17 స్కోర్‌తో మాజీ నెంబర్‌వన్ రచనోక్‌పై విజయం సాధించింది. రెండు గేమ్‌లలోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన సింధు 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. రేపు జరిగే టైటిల్ పోరులో సింధు , తైజుయింగ్‌తో తలపడనుంది. గత ఏడాది ఇదే టోర్నీలో వీరిద్దరూ తలపడగా... సింధు రన్నరప్‌గా నిలిచింది. దీంతో గత ఓటమికి రివేంజ్ తీర్చుకునేందుకు హైదరాబాదీ షట్లర్‌కు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com