హైదరాబాద్‌లో 'ఖాకి' సక్సెస్ మీట్
- November 25, 2017
కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం 'ఖాకి'. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ సంస్థ సినిమాను తెలుగులో విడుదల చేసింది. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో చిత్రబృందం పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
హీరో కార్తి మాట్లాడుతూ ''తెలుగు ప్రేక్షకులకు నేను 'ఆవారా' కార్తి, 'ఊపిరి' శ్రీనుగా గుర్తుండిపోయాను. కానీ 'ఖాకి' చిత్రం నాకు స్పెషల్ గుర్తింపును తీసుకొచ్చింది. వినోద్ స్క్రీన్‌ప్లేను చూసి అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ చూసి థ్రిల్ అయ్యారు. జీబ్రాన్ మ్యూజిక్, సత్య సినిమాటోగ్రఫీ సహా అన్ని డిపార్ట్‌మెంట్స్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో చాలా మందిలో పోలీసులపై మంచి అభిప్రాయం ఏర్పడింది. నా భార్య కూడా పోలీసులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ కితాబిచ్చింది. మా సినిమాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అంకితం ఇస్తున్నాం. నా గత చిత్రాలతో పోలిస్తే తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన చిత్రమిది. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సినిమాను చూడబోతుంది. రకుల్ ఇప్పటి వరకూ చేయునటువంటి డిఫరెంట్ పాత్రలో కనపడింది. ఇంటెలిజెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్'' అని అన్నారు.
శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 'సినిమా రెండో వారంలోకి ఎంటర్ అయినా కలెక్షన్స్ స్టడీగా సాగుతున్నాయి. వినోద్ డైరెక్షన్, కార్తి, రకుల్ పెర్ఫార్మెన్స్‌లకి మంచి ప్రశంసలు వస్తున్నాయి' అని తెలిపారు.
కొత్త కథలను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పింది. నిర్మాత సుభాష్ గుప్తా మాట్లాడుతూ 'నిర్మాతలుగా మా తొలి చిత్రమిది. సినిమా రెండోవారంలోకి ఎంటర్ అయిన సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. కలెక్షన్స్ బావున్నాయి'' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







