రిస్క్ చేసిన బన్నీ
- November 26, 2017
వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడా సీన్స్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ మురిసిపోతున్నాడు. ఇదంతా బన్నీ క్రెడిట్ నే అంటున్నాడు. ఎందుకంటే.. ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్క్ తో కూడుకొన్నవి అట. వాటిని బన్నీ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. వాటిని తెరపై చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారని చెప్పుకొంటున్నాడు.
దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అను నేను' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో స్టయిలీష్ స్టార్, సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ ని ఆరోజు చూడొచ్చన్న మాట.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







