అత్యున్నత పురస్కారంకు ఎంపికైనా బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ
- November 26, 2017
మనామా : దుబాయ్ వార్షిక వారీగా ఇచ్చే కామ్స్ ఎం ఇ ఎ అవార్డు12 వ ఎడిషన్ లో 2017 కు సంబంధించి "రెగ్యులేటరీ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్" అవార్డుకు బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ఎంపికయింది. ఈ అవార్డును కామ్స్ ఎం ఇ ఎ మార్గదర్శకాల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన, సురక్షితమైన పోటీతత్వ విఫణిని అభివృద్ధి చేయడంలో అధికార ప్రయత్నాలు రాజ్యంలో నెలకొల్పబడి ఉండాలి. ట్రా యూఏఈ, ట్రా ఒమన్ మరియు సి ఐ టి సి సౌదీ అరేబియాతో సహా ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత ప్రత్యర్థులైన పోటీదారులను అధిగమించి బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఈ పురస్కారంను గెలుచుకుంది. ట్రా యొక్క సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ డాక్టర్ ఖాలిద్ బిన్ తైజై అల్-ఖలీఫా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఒక ముఖ్యమైన చొరవను సాధించడానికి శ్రద్ధగా పనిచేసిన ట్రా సిబ్బంది ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ, ఈ పురస్కారం పొందడం ద్వారా సి టి ఐ రిస్క్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ బహ్రెయిన్ కోసం ఒక ప్రధాన అడుగు అని ఆయన సూచించారు,ఇటువంటి చట్టం దేశంలో గాని లేదా మరో ప్రాంతంలో గాని గతంలో ఉనికిలో లేదు. క్లిష్టమైన టెలీకమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలపై నష్టాలను సమగ్రంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన నియమనిబంధనలు అమలుపర్చడం ద్వారా దేశంలోని అనుసంధానిత భవిష్యత్ వైపు కొనసాగించేందుకు మరియు టెలికాం మెరుగైన సేవలను పునరుద్ధరించుకునేందుకు ఈ నిబంధనలను రూపొందించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







