జీఈఎస్‌ చివరి రోజు సమావేశం..

- November 29, 2017 , by Maagulf
జీఈఎస్‌ చివరి రోజు సమావేశం..

ప్రపంచ వ్యాపారవేత్తలకు దిక్సూచిగా మారిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ -స్టార్టప్‌ సంస్థలను మార్కెట్‌లోకి తీసుకురావడం..మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి 
ప్రపంచ వ్యాపారవేత్తలకు దిక్సూచిగా మారిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ కొత్త అవకాశాలకు కేంద్రబిందువు అవుతోంది. ఇక్కడి మార్కెట్‌ను స్టడీ చేస్తున్న వ్యాపారవేత్తలు పెట్టబడులకు అనుకూలంగా ఉందంటున్నారు. జీఈఎస్ రెండు రోజుల సమావేశాలు, చర్చాగోష్టులు కొత్త అవకాశాలను తెరపైకి తీసుకొచ్చాయి.జీఈఎస్‌ చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఇవాళ పెట్టుబడులపై విజయం సహా 25 అంశాలపై సదస్సు జరగనుంది. ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది.
సాయంత్రం 4 గంటలకు యంగ్ ఉమెన్ వింగ్ - WE ALL WIN, మహిళల గెలుపే అందరి గెలుపు అనే సందేశంతో ఆఖరి ప్లీనరీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి సురేశ్ ప్రభు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జీఈఎస్ ముగింపు వేడుకలు అత్యంత అట్టహాసంగా సాగనున్నాయి. 
ఆఖరి ప్లీనరీ ముగియగానే స్టార్టప్ విజేతలను ప్రకటించనున్నారు. మరోవైపు ఆఖరు సెషన్‌లో మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు. ఇవాళ్టి కార్యక్రమాలకు సంగీతారెడ్డి సహా పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. 
స్టార్టప్‌ సంస్థలను మార్కెట్‌లోకి తీసుకురావడం, పెట్టుబడులు సమకూర్చుకోవడం లాంటి అంశాలపైనా చర్చలు జరగనున్నాయి. నూతన ఆవిష్కరణల్లో మహిళల వాటా పెంచేందుకు, ఆర్థిక, సామాజిక ప్రోత్సాహానికి కార్యాచరణ రూపొందించనున్నారు. పారిశ్రామికవేత్తలంతా తమ ఆలోచనలను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్‌లకు ఈ జీఈఎస్ సదస్సు అత్యంత ఉపయోగకరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com