విజేతల్ని ఆకాశానికి ఎత్తే విధానం మారాలి..
- November 29, 2017
ఆటలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సరదాగా మొదలు పెట్టిన ఆట అదే కెరీర్‌గా మారుతుందని ఎవరూ ఊహించరు. అవకాశాలు కూడా అందర్నీ వరించవు. గెలుపు ఓటముల రుచి చూస్తూ, ఎత్తు పల్లాల్ని అధిగమిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొటూ చివరకు ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు. అది ఒక్క ఆటల్లోనే కాదు.. అన్నింటా ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ విజేతల్ని మాత్రమే ఆకాశానికి ఎత్తే ధోరణి సరికాదంటున్నాడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా క్రీడా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన చర్చా గోష్టిలో గోపీచంద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రీడలకు ప్రాధాన్యమిస్తూ స్థానిక క్రీడల్ని మరచి పోతున్నాం. మీడియా కూడా స్థానిక క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి. పారిశ్రామిక వేత్తలు కూడా ఆ దిశగా ఆలోచించాలి అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడల్ని ఒక పరిశ్రమగా భావించి పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలి అని అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ఆటలు ఆడే వాళ్లందర్నీ ఛాంపియన్లుగా భావించి ఆ దిశగా ప్రోత్సహిస్తే మెరుగైన క్రీడాకారులు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







