అవికా: నో మోర్ నటన..ఓన్లీ డైరెక్షన్
- December 01, 2017
"చిన్నారి పెళ్లికూతురు" సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి."ఉయ్యాలా జంపాల" లో రాజ్ తరుణ్ తో జత కట్టి కుర్రకారుల హృదయాలను దోచుకుంది "అవికా గోర్". తెలుగు బుల్లితెరకు ఆనందిగా పరిచయమై. అటు తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించి తనదైన నటనతో పేరు తెచ్చుకున్న అవికాగోర్ గురించి తెలియని వారుండరు. సినీ అభిమానుల కన్నా టీవీ సీరియల్ అభిమానులకే ఆమె గురించి బాగా తెలుసు.తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది ఓసారి తనకంటే పద్దెనిమిదేండ్లు పెద్దవాడితో పెళ్లికి సిద్దమవుతుందని. . మరోసారి ఇద్దరు స్టార్ హీరొయిన్స్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది..ఇప్పుడేమో సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట..!
ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల భామ కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉండేది.లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడితో కూడా అందరిని ఆకట్టుకుంది .బొద్దుగా తయారయి అవకాశాలు లేకపోవడంతో లుక్ మొత్తం మార్చేసింది. అయినప్పటికీ కూడా సినిమా అవకాశాలు రాలేదు..ఆ మధ్య టాలివుడ్ హీరో ఒకరు వేధిస్తున్నారని బాదపడి సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది.తాను నటన నుంచి వైదొలగాలనుకుంటుందట. .
సినిమాలకు దర్శకత్వం వహించడంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు.. ఆఫర్లు రాకపోవడంతో నటన నుంచి బ్రేక్ తీసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆఫర్లు రాకపోవడంతో కాదని, తాను సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది." నేను బ్రేక్ తీసుకోవడానికి ఒక కారణముంది. ఫిల్మ్‌మేకింగ్ స్టడీస్, మేకింగ్ ఫిల్మ్స్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నా" అని అవికా తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







