వివాహేతర సంబంధం...భార్యను కాల్చిన జవాను
- December 01, 2017
వివాహేతర సంబంధం ముగ్గురి హత్యకుదారితీసింది. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు... తన ఇంట్లోని పడక గదిలో తన భార్య మరో జవానుతో సన్నిహితంగా (అసభ్యభంగిమలో) ఉండటాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఆ తర్వాత తేరుకుని ఆగ్రహోద్రుక్తుడై తన చేతిలోని తుపాకీతో కట్టుకున్న భార్యతో పాటు తప్పుడుపనికి పాల్పడిన జవానును, సదరు జవాను భార్యను కూడా కాల్చి చంపాడు. ఆ తర్వాత నేరుగా తుపాకీతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగింది. మూడు హత్యలకు పాల్పడిన జవాను తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన జవాను. గురువారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సంగం గ్రామానికి చెందిన ఇంజలపు సురేందర్ అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లాలో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఏడేళ్ళ క్రితం లావణ్య అనే యువతితో వివాహమైంది. గత మూడేళ్లుగా తాను పని చేసే చోట ఉన్న సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో లావణ్యకు తన ఇంటిపక్కనే ఉండే మరో రాజేష్ అనే జావనుతో వివాహేతరసంబంధం ఏర్పడింది. తన భర్త సురేందర్ విధులకు వెళ్లిన సమయంలో పక్కింటి రాజేష్‌తో శారీరక సుఖం పొందుతూ వచ్చింది.
ఈ క్రమంలో ఇటీవల సురేందర్ రాత్రి విధులకు వెళ్లి మధ్యలోనే ఇంటికి తిరిగివచ్చాడు. అపుడు తన భార్య పక్కింటి రాజేష్‌తో పడక గదిలో సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. ఆ వెంటనే తనవద్ద ఉన్న తుపాకీతో భార్య లావణ్యను, జవాను రాజేష్‌ను కాల్చి చంపాడు. తుపాకీ శబ్దానికి పక్కింట్లో ఉన్న రాజేష్ భార్య శోభ.. సురేందర్ ఇంటికి వచ్చి చూడగా, తన భర్త రక్తపుమడుగులో పడివుండటం చూసి హతాశురాలైంది.
ఆతర్వాత తేరుకుని సురేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికీ ఆగ్రహం చల్లారని సురేందర్ ఆమెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తుపాకీతో నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ కూడా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్







