'ఓఖీ'లో చిక్కుకున్న లక్ష్యద్వీప్
- December 02, 2017
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను 'ఓఖీ' తుపాను వణికిస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లక్షద్వీప్ దీవుల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. సమాచార వ్యవస్థ దెబ్బతింది. మినికోయి దీవిలో శనివారం ఉదయం వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్పెనీ, మినికోయి ప్రాంతాల్లో అనేక ఇళ్లు కుప్పకూలాయి. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే పెను తుపానుగా మారిన ఓఖీ వల్ల వచ్చే 24 గంటల్లోనూ లక్షద్వీప్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు కన్యాకుమారిలోనూ ఓఖి తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. శనివారం ఉదయం వరకూ అక్కడి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. ఎటు చూసినా మోకాలి లోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉండిపోయాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







