భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం: కేటీఆర్
- December 02, 2017
హైదరాబాద్: మెట్రో రైలు సౌకర్యాన్ని భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
శనివారం హైదరాబాదులో కేటీఆర్ మాట్లాడుతూ రెండో దశ మెట్రో రైలు మార్గం విస్తరణలో భాగంగా మరో 80 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ మధ్యే ప్రారంభమైన మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని అన్నారు. ఇప్పటికే జరుగుతున్న మెట్రో పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మెట్రో రైలులో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ప్రయాణం చేసిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







