డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన యంగ్ కమెడియన్
- December 02, 2017
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో టాలీవుడ్‌కు చెందిన యంగ్ కమెడియన్ నవీన్(కుమారి 21ఎఫ్ ఫేమ్) కూడా ఉన్నాడు. తప్పతాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అనంతరం మీడియాను చూసి భయంతో కారు క్రింద నక్కి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నవీన్‌పై కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు, ఆయన కారును సీజ్ చేశారు.
నవీన్‌తో పాటు పబ్బుల్లో ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతున్న పలువురు యువతులను కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో దాదాపు 20 మందిపై కేసులు నమోదు చేయగా.. 14 కార్లు, 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







