రేపటి ఆశ
- November 15, 2015

నాకు నిన్న రాత్రి మగత నిద్ర లో ఒక మధుర స్వప్నం
ఎవరో దైవ దూత ఒక చక్కని సువార్త లోకానికి మోసుకొచ్చినట్లు
దేవేంద్రుడు తన కన్నా కలియుగానికే ఎక్కువ అవసరమని
"కల్ప వృక్షం" బహుమతిగా పంపినట్లు
అక్రమర్కులంతా తమ అక్రమాస్తులన్ని కనువిప్పుతో
ప్రజలకు పంచినట్టు
కొత్త నాయకత్వం అంతా ఏ సామాన్యుడి చెమట చుక్క
దోచుకోమని శభదమ్ చేసినట్టు
అది చూసి లోకులంతా ఆనంద పారవశ్యంలో నృత్యం
చేస్తున్నట్టు
నేను వారి సంతోషానికి రెండు ఆనంద బాష్పలనై రాలుతున్నట్టు
నన్ను నేలను తాకకుండా నా ప్రేయసి కళ్ళతో తాగేసి
తన హృదయ పానుపు పై సేద దీర్చినట్లు...
నేనేమో దిగ్గున లేచి అన్ని కలల్లాగే ఇదికూడా ఎక్కడ
కరిగి పోతుందో నని,, ఇలా మీ ముందుకు వంపి
మళ్లీ కరిగి పోనీ చీకటి లోకి జారుకుంటూ
ఈ కల "రేపటి ఆశ" ఆయి మొలకెత్తునేమో అన్న ఆశతో ...
--జయ రెడ్డి బోడ
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







