యూఎస్ లో బహుబలి రికార్డ్ ని బీట్ చేసిన పవన్ 'అజ్ఞాత వాసి..'!!

- December 05, 2017 , by Maagulf
యూఎస్ లో బహుబలి రికార్డ్ ని బీట్ చేసిన పవన్ 'అజ్ఞాత వాసి..'!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రికార్డులు సృష్టించడం కొత్తేమి కాదు. పవర్ ప్రభంజనానికి త్రివిక్రమ్ కూడా యాడ్ అవ్వడంతో ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా బాక్సాఫీస్ పై పంజా విసరబోతున్నాడు పవర్ స్టార్. ఓవర్సీస్ మార్కెట్ కి కీలకమైన అమెరికాలో లో ఇంత వరకు ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వనన్ని లొకేషన్స్ లో క్రేజీ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్ అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త రికార్డుల మీద కన్నేశాడు. తన 25వ సినిమా అజ్ఞాతవాసితో బాక్సాఫీస్ రికార్డులు సాధించడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో సినిమాకి కూడా అంతే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. 
ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమతో పాటు కర్ణాటకలోనూ భారీగా విడుదలయ్యే అజ్ఞాతవాసి సినిమాని, ఓవర్సీస్ మార్కెట్ కి కీలకమైన అమెరికాలో ఎవరూ ఊహించనివిధంగా రిలీజ్ చేస్తున్నారు. 209 లొకేషన్స్ లో అజ్ఞాతవాసి అత్యధిక స్క్రీన్స్ లో విడుదలవుతోంది. ఇన్న లొకేషన్లలో ఓ ఇండియన్ సినిమా రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్. ఈ రికార్డును పవర్ స్టార్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో హాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ టేకింగ్ అండ్ డైలాగ్స్, హీరోయిన్లు కీర్తు సురేష్, అను ఇమ్మానుయేల్ గ్లామర్, అనిరుథ్ మ్యూజిక్ తో పాటు ఆది పినిశెట్టి, ఖుష్బూ పెర్ఫార్మెన్స్ అజ్ఞాతవాసికి హైలైట్ గా ఉండబోతున్నాయి. జనవరి 10న వరల్డ్ వైడ్ గా అత్యధిక ధియేటర్లలో ఈ సినిమా రిలీజ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయబోతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com