భారీ బడ్జెట్ తో వస్తున్నా సైఫ్ కూతురు
- December 05, 2017

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టేసింది. ఎట్ ప్రజెంట్ కేదార్నాథ్ ఫిల్మ్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకువచ్చింది.
కొంతపార్ట్ ఇటీవల ఉత్తరాఖండ్‌లో షూట్ చేశారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం పెద్దఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్. కేదార్నాథ్ టెంపుల్ తరహాలోనే భారీ సెట్‌ని ముంబైలోని ఓ ఫిల్మ్ సిటీలో నిర్మించారు. ఈ సెట్ గురించి యూనిట్ సభ్యులే రకరకాలు మాట్లాడుకుంటున్నారు.
భారీ వరదలు ముంచెత్తి టెంపుల్ మునిగి సీన్లను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లను రప్పించారు. నాలుగేళ్ల కిందట ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీ మూవీగా చెబుతున్నారు యూనిట్ సభ్యులు.
ఈ చిత్రం కోసం ప్రొడ్యూసర్ బాగానే ఖర్చు చేస్తున్నట్లు ఇన్సైడ్ సమాచారం. సారా పక్కన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. మొత్తానికి వచ్చేఏడాది ఓ వైపు జాన్వికపూర్, మరోవైపు సారా అలీఖాన్‌లు తమతమ సినిమాలతో వెండి ప్రేక్షకులను అలరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







