రూ.1 డౌన్‌పేమెంట్, లక్ష రూపాయలు ఆదా: టాటామోటార్స్
- December 05, 2017
న్యూఢిల్లీ: ఇయర్-ఎండ్ అమ్మకాల్లో భాగంగా ఆటోమోబైల్ దిగ్గజం టాటామోటార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెగా ఆఫర్ మ్యాక్స్ సెలబ్రేషన్స్ సేల్స్ ఆఫర్‌ను టాటామోటార్స్ లాంచ్ చేసింది. ఈ ఆఫర్లో భాగంగా టాటా కారు కొనుగోలుకు రూపాయి డౌన్‌పేమెంట్ కట్టి, లక్ష రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. మోడల్, వేరియంట్‌పై ఈ ఆఫర్ ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఇయర్-ఎండ్ అమ్మకాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం టాటామోటార్స్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దిగ్గజ ఫైనార్షియర్లు, బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరచుకున్న టాటామోటార్స్, ఆకర్షణీయమైన ఫైనాన్షియల్ స్కీమ్స్‌తో ప్యాసెంజర్ వాహనాలపై 100శాతం వరకు ఫండింగ్ అందిస్తోంది. తమ కార్లను ఎక్ఛేంజ్ చేసుకోవడానికి కస్టమర్లకు ఇది ఎంతో ఉన్నతమైన అవకాశమని, భారీ మొత్తంలో సేవింగ్స్ ప్రయోజనాన్ని కస్టమర్లు పొందవచ్చని టాటామోటార్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







