సోలార్ విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న యోగా గురు
- December 05, 2017
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరో కీలకమైన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. పతంజలి ఉత్పత్తులతో ఎఫ్‌ఎంసిజి దిగ్గజాలకు సైతం గుండెల్లో గుబులు పుట్టించిన రాందేవ్ తాజాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంపై దృష్టిపెట్టారు. సోలార్ విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతీ ఇంటికి సోలార్‌విద్యుత్ లక్ష్యంగా భారీ పెట్టుబడితో సోలార్ కరెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. స్వదేశీ ఉద్యమానికి అనుగుణంగా సోలార్‌పవర్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నామనిఇ పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తద్వారా భారతదేశంలో ప్రతి ఇంటికి సోలార్‌విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీపడకుండా భారతదేశంలో సౌర ఫలకాలను తయారుచేస్తాము. కానీ చైనీస్ సోలార్ ప్యానెల్ ధరల యుద్ధంలోకి రామని ఆయన చెప్పారు. డిమాండ్ కనుగుణంగా వ్యాపార విస్తరణను పరిశీలిస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెకాల్నజీస్‌తో ఒప్పందం చేసుకుంది.
రూ.100కోట్ల పెట్టుబడితో గ్రేటర్ నోయిడాలోని కర్మాగారాన్ని 20 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నెలకొల్పనుంది. తదుపతి రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







