విజయ్ తో రాజశేఖర్ కూతురు రొమాన్స్..!!
- December 05, 2017
తెలుగు సినీ ఇండస్ర్టీలో తండ్రి వారసత్వంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఒక్కరే. ఆమెనే మెగా డాటర్ నిహారిక. ఇదే జాబితాలో తాను ఉంటానంటోంది హీరో రాజశేఖర్ కూతురు శివాని. నిహారిక కన్నా తానేమి తక్కువ కాదంటూ పోటీ ఇచ్చేందుకు రెడీ అంటోంది శివాని.
అయితే, నిజానికి తన తనయని ఇంతకు ముందే టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకున్నాడు రాజశేఖర్. కానీ, ఓ వైపు ఆర్థిక సమస్యలు, మరో వైపు తన కెరియర్ సరిగ్గా లేకపోవడంతో వెనకడుగు వేశాడు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ పుణ్యమా అని గరుడవేగ చిత్రంతో హిట్ కొట్టిన రాజశేఖర్, తన కూతురు సినీ ఇండస్ర్టీ ఎంట్రీకి ఇదే సమయమని భావించాడు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ, శివానిలతో ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేశాడు రాజశేఖర్.
ప్రస్తుతం శివాని మెడిసిన్ చదువుతోంది. మరో పక్క విజయ్ వరుస ప్రాజెక్టులతో బిజీ.. బిజీగా గడుపుతున్నాడు. అయితే, శివాని మెడిసిన్ పూర్తయ్యేసరికి విజయ్ సినిమాలు ఓ కొలిక్కి వస్తాయని, ఈ మధ్యలోనే విజయ్‌తో చర్చలు జరిపి శివాని ఎంట్రీని ఓ కొలిక్కి తీసుకురానున్నారు రాజశేఖర్. ఈ విషయం కాస్తా సినీజనాల చెవిన పడటంతో రాశేఖర్ కూతురు శివాని త్వరలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనుందా..! అంటూ చర్చించుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల