జవనరి 26న 'రోబో 2.O' టీజర్ విడుదల
- December 06, 2017
శంకర్ ఆలోచనలను ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. సర్ ప్రైజులు, షాకులతో టు పాయింట్ ఓ ను తెరకెక్కిస్తూ సినీజనాలందరినీ కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసి సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని అయోమయంలో పడేసిన శంకర్, జవనరి 26కు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు.
శంకర్ ఇమాజినేషన్ కు బాక్సాఫీస్ ఎప్పుడూ సర్ ప్రైజ్ అవుతూనే ఉంటుంది. ఈ గ్రేట్ మేకర్ కాన్వాస్ పై చేసే మేజిక్స్ కు ప్రేక్షకులు థ్రిల్ అవుతుంటారు. అంత ఫ్రెష్ థాట్స్ తో సినిమాలు తీసే శంకర్, 450కోట్లతో రోబో సీక్వెల్ స్టార్ట్ చేయ్యగానే టు పాయింట్ ఓ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఇండియన్ సినిమాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే టాక్ వచ్చింది. సెట్స్ లో ఉండగానే భారీ బజ్ క్రియేట్ చేసిన టు పాయింట్ ఓ టీజర్ ను జనవరి26న లాంచ్ చేస్తున్నాడు
టు పాయింట్ ఓ సినిమా జనవరి26నే రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. కానీ గ్రాఫికల్ వర్క్ బాలెన్స్ ఉండడంతో సినిమాను ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు. దీంతో సూపర్ స్టార్ విజువల్ వండర్ కోసం వెయిట్ చేస్తోన్న తలైవా అభిమానులు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఆ నిరాశను తగ్గించి, సినిమాపై ఉన్న బజ్ ను మరింత పెంచడానికి జనవరి26న టీజర్ రిలీజ్ చేస్తున్నాడు శంకర్. మరి టు పాయింట్ ఓ ఏప్రిల్ రిలీజ్ అనగానే రిలీజ్ డేట్స్ ను రీచెక్ చేసుకుంటోన్న సమ్మర్ మూవీస్ లో టుపాయింట్ ఓ ను తట్టుకుని ఎన్నిసినిమాలు నిలబడతాయో చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల