తగ్గిన పసిడి ధరలు
- December 06, 2017
బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం, అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుండటంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ.200 మేర తగ్గాయి. బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు 200 రూపాయలు తగ్గి రూ.30,050గా నమోదయ్యాయి. అంతేకాక వెండి ధరలు కూడా కిందకి పడిపోయాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో, వెండి ధరలు రూ.500 తగ్గి, కేజీకి రూ.38,500గా రికార్డయ్యాయి.
అంతర్జాతీయంగా కూడా బంగారం ధర 0.76 శాతం తగ్గి, ఔన్స్‌కు 1,265.90 డాలర్లు, వెండి ధర 1.41 శాతం క్షీణించి, ఔన్స్‌కు 16.06 డాలర్లు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 200 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,050గా, రూ.29,900గా ఉన్నాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







