క్యాప్సికం లో ఔషధ గుణాలు పుష్కలం
- December 06, 2017
బెంగుళూరు మిర్చిగా పిలుచుకునే క్యాప్సికం ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కు గా లభిస్తుంది. రకరకాల రంగుల్లో సైతం లభ్యమవుతుంది. కాని రెగ్యులర్‌గా దొరికేవి మాత్రం ఆకు పచ్చవే. ఒక రోజుకు కావాల్సిన సి విటమిన్ ఒక్క క్యాప్సికంలోనే దొరుకుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న క్యాప్సికం గురించి తెలుసుకుందాం... క్యాప్సికంలో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంన్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, ఎంజైమ్స్ శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్ పసుపు పచ్చ క్యాప్సికంలో అధికంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో పోషకాలు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి లు టమాటాలో కన్నా క్యాప్సికంలోనే అధికంగా ఉంటాయి. కొవ్వుక్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంచడానికి క్యాప్సికం దోహద పడుతుంది. ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాప్సికం తీసుకోవడం మూలంగా జుట్టు ఊడి పోవడం తగ్గుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారినిగా పనిచేస్తుంది. ఇన్ని ఔషద గుణాలున్న క్యాప్సికాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనకు అందబాటులో దొరికే క్యాప్సికం వాడేందుకు ఎందుకింక ఆలస్యం.. రోజు వారి కూరగాయల్లో ఒక రోజు క్యాప్సికాన్ని కూడా చేర్చుకుందాం.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







