ఆలూ కోఫ్తా కర్రీ
- December 06, 2017కోఫ్తా కోసం కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు: అరకిలో(ఉడికించి మెత్తగా పెట్టుకోవాలి), చిన్న ఉల్లిపాయ: ఒకటి(ముక్కలుగా చేసుకొని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి), కారంపొడి: రుచికి సరిపడా, పసుపు: టేబల్ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, కొత్తిమీర: కొన్ని ఆకులు.
కూరకి కావలసిన పదార్థాలు: కారంపొడి: టేబుల్ స్పూను, ఎండు మిరపకాయల ముక్కలు: పావు టీస్పూను, ఉప్పు: సరిపడ, నీరు: ఒకటిన్నర కప్పు, నూనె: తగినంత, ఉల్లిపాయలు: పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, టమొటా ప్యూరి: రెండు టేబుల్ స్పూన్లు, క్రీము: రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర ఆకులు: కొన్ని.
తయారీ విధానం: ఓ గిన్నెలో కోఫ్తా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. బాండీలో నూనె పోసి ఒకటి రెండు కోఫ్తాలు చొప్పున అన్నీ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కప్పు నీటిలో కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కోఫ్తాలు వేయించగా మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కారపు నీటిని పోసి కొద్దిగా తెర్లనివ్వాలి. దీనికి టమోటా ప్యూరీ కూడా కలిపి మరికొద్ది సేపు ఉడకనివ్వలి. ఓ పదినిమిషాల తరువాత క్రీము జతచేస్తూ బాగా కలపాలి. ఇప్పుడు కోఫ్తాలు కూడా జత చేసుకోవాలి. అన్నీ కలిపి మరికొద్దిసేపు ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లుకొని దించేయాలి.
తాజా వార్తలు
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్లైన్
- దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- అబుదాబిలో డ్రైవర్ లెస్ ఉబర్ సేవలు..ఎలా బుక్ చేయాలంటే..?
- మోటార్సైకిలిస్ట్ దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు..!!
- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి బిగ్ అలెర్ట్!
- దుబాయ్ 'నైట్ సఫారీ' పార్క్ సమయాలు పొడింగింపు..!!
- రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్