అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
- December 06, 2017
పై చదువుల కోసం ఎంతో సంతోషంతో అమెరికాకు వెళ్లిన ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. కుత్భుల్లాపూర్ సూరారంకు చెందిన నాగ తులసీరామ్(26) మంగళవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తులసీరామ్‌ను ఓ మహిళ కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తులసీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిడ్జిపోర్టు యూనివర్సిటీలో నాగ తులసీరామ్ ఎంఎస్ చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పిల్లల చిన్నతనంలోనే నాగ తులసీరామ్ తల్లి మృతిచెందింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!