'అ' సినిమా ఫస్ట్ లుక్
- December 07, 2017
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ స్టార్...ఎవరూ అంటే వెంటనే చెబుతారు నేచురల్ స్టార్ నానీ అని..ఎందుకంటే ఓ హీరోకి వరుసగా విజయాలు దక్కడం అనేది చాలా అరుదు. మారుతి దర్శకత్వంలో 'భలే భలే మగాడివోయ్' చిత్రం తర్వాత నానికి వరుసగా విజయాలు దక్కుతున్నాయి. ఈ సంవత్సరం నేను లోకల్, నిన్నుకోరి చిత్రాలతో మంచి విజయం అందుకున్న నాని త్వరలో 'ఎంసిఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) తో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. నటుడిగా రాణిస్తున్న నాని ఇటీవల వాల్ పోస్టర్ అనే ప్రొడక్షన్ సంస్థ స్థాపించి ఈ బేనర్‌పై నిర్మాతగా 'అ' అనే సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్ అవసరాల,నిత్యామీనన్,నిత్యామీనన్ రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శిని లీడ్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 80 శాతం పూర్తి చేసుకుంది. ఇటీవలే నాని తన ట్విట్టర్ ద్వారా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు.
ఆ తర్వాత వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్‌లో నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలో మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అవసరాల నానికి సంబంధించి ఈ లుక్ చూస్తుంటే..పూర్తి సైంటిఫిక్ చిత్రంలా అనిపిస్తుంది..ఎందుంటే మనోడు పెద్ద సైంటిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు.


తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







