తప్పతాగి హీరో అర్జున్ పై దాడి
- December 07, 2017
బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ పై దాడి జరిగింది. అతని తాజా చిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్ర సెట్స్ కు వచ్చిన ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చే వంకతో అర్జున్ పై దాడి చేశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఫుల్‌గా తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారమే ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం... ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని ఫింథోర్‌ఘడ్‌లో జరుపుకుంటోంది. ఈ క్రమంలో కమల్ కుమార్ అనే ఓ డ్రైవర్ సెట్స్ లోకి వచ్చాడు. వానిటీ వ్యాన్ దగ్గర అర్జున్ ను కలిసి షేక్ హ్యాండ్ కోరాడు. ఆపై అతని చెయ్యిని మెలితిప్పటం ప్రారంభించాడు. ఇది గమనించిన చిత్ర యూనిట్ సభ్యులు కమల్‌ను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో అర్జున్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాగా, దాడి చేయటంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరం కింద అతనికి శిక్ష పడనుంది.
ఇదిలా ఉంటే దిబకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న సందీప్ ఔర్ పింకీ ఫరార్ వచ్చే ఏడాది ఆగష్టు 18న విడుదల కానుంది. ఇందులో అర్జున్ ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల