పార్కింగ్ చేసిన కారులో చనిపోయిన వ్యక్తి గుర్తింపు
- December 09, 2017
మనామ: బహ్రెయిన్ లో పార్కింగ్ చేయబడిన ఒక కారులో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు.బిలాడ్ ఆల్ ఖదీం మసీదు పక్కన నిలిపి ఉన్న ఒక కారులో చనిపోయిన వ్యక్తి హుస్సేన్ అలీ మహ్మద్ గా గుర్తించబడ్డాడు. మృతుడు మమమా నివాసిగా గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకుముందు ఆయన బిలాడ్ అల్ ఖదీమ్ నివాసితులు. ఎటువంటి కదలిక లేకుండా కారులో నిర్జీవంగా ఉండిన స్థితిలోకనుగొన్నకొంతమంది ఆ వ్యక్తి ఏవైనా మత్తులో మునిగివున్నాడేమోనని తొలుత అనుమానించినట్లు వారు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి మృతికి దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారణ ఏదీ అందుబాటులో లేదు. ఈ సంఘటన గూర్చి అంతర్గత వ్యవహారాల శాఖ సైతం ఏ విషయం ఇంకా నిర్ధారించలేదు. సమీపంలోని ఒక రెస్టారెంట్ సి.సి.టి.వి ఫుటేజ్ నుండి పోలీసులు చనిపోయిన ఆ వ్యక్తి అక్కడే ఉంచారని కనుగొన్నారు. ఫుటేజ్ ప్రకారం, మంగళవారం రాత్రి 9.58 గంటలకు ఆ కారును పార్కింగ్ స్థలంలో ఉంచినట్లు తేలింది. రెస్టారెంట్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడ కారు పార్కింగ్ చేసిన వ్యక్తిని గమనించినట్లు అయితే ఆయన ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించలేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







