శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడబోయిన గ్రిల్లోట్‌కి లభించిన గౌరవం

- December 11, 2017 , by Maagulf
శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడబోయిన గ్రిల్లోట్‌కి లభించిన గౌరవం

న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగిన కాన్సాస్ కాల్పుల్లో భారతీయులను కాపాడబోయిన ఇయాన్ గ్రిల్లోట్‌కి అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ ప్రతిఏటా ప్రకటించే సాహసవీరుల జాబితాలో ఆయన పేరును కూడా ప్రకటించింది. ''2017లో మనలో ఆశలు నింపిన 5గురు హీరోలు'' అంటూ టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా విడుదల చేసింది. భారత యువకులు శ్రీనివాస్ కూచిభొట్ల, ఆయన స్నేహితుడు అలోక్ మాదసానిపై ఓ మాజీ నేవీ ఉద్యోగి కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శ్రీనివాస్ మృతిచెందగా.. అలోక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులకు తెగబడిన ఉన్మాదిని అడ్డుకునేందుకు 24 ఏళ్ల అమెరికా యువకుడు గ్రిల్లోట్ ప్రాణాలకు తెగించాడు. ఈ క్రమంలో అతడి చాతీలోకి ఓ బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. ''అక్కడ నేనేమీ చేయకుండా ఉండిఉంటే... నేను నేనుగా బ్రతకలేకపోయేవాడిని..'' అని గ్రిల్లోట్ పేర్కొన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com