ఫిబ్రవరి 2న విడుదల కానున్న 'ఛలో' సినిమా
- December 16, 2017
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగశౌర్య. త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి 2018, ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
చిత్ర సమర్పకుడు... శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ.... మా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మించిన ఛలో చిత్రాన్ని ఫిబ్రవరి 2, 2018న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే చిత్రంగా ఛలో నిలుస్తుందని నమ్ముతున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు.
నటీనటులు - నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







