బహ్రెయిన్‌లో 46వ నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 16, 2017
మనామా: 46వ నేషనల్ డే సందర్భంగా బహ్రెయిన్‌లో సంబరాలు మిన్నంటాయి. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఈ సందర్భంగా బహ్రెయిన్ నేషనల్ డే వేడుకల సందర్భంగా బహ్రెయిన్ నాయకత్వానికి శుభాకాంక్షలు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో కింగ్‌ని అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. బహ్రెయిన్ అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళ్ళాలనీ, ఈ క్రమంలో అమెరికా సహాయ సహకారాలు బహ్రెయిన్‌కి ఎల్లప్పుడూ ఉంటాయని ఆ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యునైటెడ్ కింగ్‌డమ్ క్వీన్ ఎలిజిబెత్, అలాగే అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు, ఇతర స్నేహపూర్వక దేశాల నుంచి బహ్రెయిన్‌కి శుభాకాంక్షలతో కూడిన సందేశాలు అందాయి. ప్రపంచ వ్యాప్తంగా బహ్రెయిన్ ఎంబసీస్‌లో కూడా బహ్రెయిన్ 46వ నేషనల్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో జరిగిన ఈ వేడుకల్లో ఆయా దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







