సౌదీ టార్గెట్: ఇరాన్‌లో తయారైన మిస్సైల్‌ని సంధించిన హౌతీ మిలిటెంట్స్
- December 16, 2017
మనామా: సౌదీ పైకి యెమెన్‌లోని మిలిటెంట్స్ ప్రయోగించిన ఓ మిస్సైల్, ఇరాన్ తయారీగా రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేయడంతో, ఇరాన్ తీరు పట్ల బహ్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యెమెన్‌లో అల్లర్లకు ఇరాన్ ప్రోత్సాహం అందించడమే కాకుండా, అరబ్, జిసిసి దేశాల్లో అస్థిరతకు హౌతీ మిలిటెంట్స్‌కి ఇరాన్ అండగా ఉండి, ఆయుధాల్ని కూడా అందజేస్తోందని బహ్రెయిన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. అమెరికా, అలాగే యునైటెడ్ నేషన్స్ ఈ విషయంలో ఇరాన్ తీరుని తప్పు పట్టడాన్ని బహ్రెయిన్ ప్రస్తావించింది. ఇరాన్ తక్షణం ఈ చర్యల్ని ఆపాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశంతో అయినా స్నేహ సంబంధాలు కొనసాగించే ప్రశ్నే లేదని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలిసి పోరాడేందుకు బహ్రెయిన్ ముందుంటుందని బహ్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







