మహేష్ కోసం సైజు మారిన అల్లరి నరేష్
- December 17, 2017ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమా తరువాత వంశీ పైడీపల్లి దర్శకత్వంలో మరో తన 25వ సినిమా చేయనున్నాడు మహేష్. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడు.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ న్యూ లుక్ లో దర్శనమివ్వనున్నాడట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న నరేష్ కాస్త బొద్దుగా కనిపించాడు. దీంతో ఈ లుక్ మహేష్ సినిమా కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మేడ మీద అబ్బాయి సినిమాతో మరోసారి నిరాశపరిచిన నరేష్, కెరీర్ ను మలుపు తిప్పే ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు