సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వనున్న తేజస్వి..
- December 18, 2017
ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలు అరుదు. గ్లామర్ , టాలెంట్ రెండూ ఉన్న నటులు ఇంకా అరుదు. అలాంటిది ఈ రెండూ ఉన్న తార మన తెలుగు అమ్మాయి తేజస్వి. ఐస్ క్రీం సినిమాతో సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పటికే కుర్రకారు మతిని తనదైన శైలిలో ఫోటో షూట్ తో పోగొట్టేస్తోంది. తాజాగా ఈ భామ మరో సంచలనం సృష్టించింది.
బీయఫ్ అనే టైటిల్ తో వస్తున్న చిత్రంలో ఈమె నటిస్తోంది. అందులో ముఖ్యమైన పాత్రలో హాట్ హాట్ సన్నివేశాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా నటించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు ఈ అమ్మడు ఏమి చేసినా సరైన బ్రేక్ రాలేదనే చెప్పలేక చెప్పుకోవాలి , అలాంటిది ఈ సినిమాతో అందరి నోళ్ళు మూయించే పని లో పడ్డట్టు సమాచారం. ఈ మధ్యనే హంటర్ ఆధారంగా బాబు బాగా బిజీ అనే సినిమాలో ముఖ్య పాత్రని చేసినా , ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో కెరీర్ కి కావలసిన సక్సెస్ ని అందుకోలేదనే చెప్పాలి.
అందుకే ఇప్పుడు బాలక్ పాలక అనే మరాఠీ చిత్రానికి తెలుగు రీమేక్ బియఫ్ అనే సినిమాలో నటిస్తోంది. మరాఠీ లో ఒకప్పటి ఆగ్ర హీరో, జనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ నిర్మించారు. ఈ సినిమా సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంగా సాగుతుంది.యువ దర్శకుడు శ్రీకాంత్ వేలగేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే చివరి దాకా ఈ సినిమాకి బీయఫ్ అనే టైటిల్ ఉంటుందో , లేదా వర్కింగ్ టైటిల్ గా మాత్రం తీసుకుంటున్నారో తెలియాల్సి ఉంది.
ఒక వయస్సులో ఉండే యువతీ , యువకులు సెక్స్ పై ఎలా స్పందనలు ఎలా ఉంటాయి. వాటికి సంబందించిన అడల్ట్ ఎడ్యుకేషన్ ని ఈ సినిమాలో చూప్నిచారు. రవి జాదవ్ మరాఠీ లో తీసిన ఈ సినిమాకు మంచి ప్రశంశలు లభించాయి.
మొదట్లో షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు , అంతగా ప్రోగ్రెస్ లేకుండా నడుస్తోందనే చెప్పాలి. కొత్తగా ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈ విషయం పై మీడియా తేజస్వి ను ఆరా తీయగా తనకు కూడా పూర్తి సమాచారం తెలియదు అని చెప్పుకొచ్చింది, ఈ భామ.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







