ఓరినీ! ఇది చేపను పోలిన మనిషి కాదట..!!
- December 18, 2017
ఈ మద్య సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతుంది. ఆ మద్య వైజాగ్ లో రెండు వింత పక్షులు వచ్చాయని..అవి ఏలియన్స్ అని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు..తీరా చూస్తే అవి గుడ్లగూబ జాతికి చెందిన పక్షులని తెలియడంతో అంతా నీరుగారిపోయారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది కూడా విశాఖ నుంచే కావడం విశేషం. విశాఖ తీరంలో జాలర్లకు అచ్చం మనిషిని పోలిన చేప దొరికిందని అంటున్నారు.
ముందు ఉదర భాగం, చేతులు అచ్చం మనిషి పోలి ఉన్న ఆ చేప వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం..ఆయితో ఆ వీడియోలో నిజంగా మనిషిని పోలినట్లు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
దీనికి గురించి కొంత మంది వాకబు చేయగా..అది, అస్సలు జీవే కాదని, ఓ కళాకారుడు రూపొందించిన కళాఖండమని తెలిసింది. మయన్మార్‌కు చెందిన ఓ కళాకారుడు చెక్క, ఫైబర్ వినియోగించి ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు మయన్మార్ పత్రికలు వెల్లడించారు. ఈ కళాఖండం సహజంగా కనిపించేందుకు దాని గొంతు భాగంలో మోటారును ఏర్పాటు చేశారు.
ఈ కళాఖండానికి చెందిన ఫొటోలు, వీడియోలు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. కొందరు ఇది విశాఖపట్నంలోనే దొరికిందంటూ తప్పుడు ప్రచారం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ గా షేరవుతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల