ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి
- December 18, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 19న రాష్ట్రపతి హైదరాబాద్ రానున్నారు. 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు రాత్రి రామ్‌నాథ్ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి నివాళులర్పించి.. ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







