మానవ జీవితం విలువను చిన్నారులకు వివరిస్తున్న 'ఒమాన్ ప్రైడ్' కాంపైన్

- November 18, 2015 , by Maagulf
మానవ  జీవితం  విలువను  చిన్నారులకు  వివరిస్తున్న 'ఒమాన్ ప్రైడ్' కాంపైన్

ఒమాన్ లోని ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు టైమ్స్ ఆఫ్ ఒమాన్ వారితో కలసి గత రెండువారాలుగా నిర్వహిస్తున్న'ఒమాన్ ప్రైడ్' కాంపైన్ లో భాగంగా , కేన్సర్ అవగాహన పెంపొందించే  'వాక్ ఫర్ కేన్సర్' అనే కార్యక్రమం ఒమాన్ కేన్సర్ అసోసియేషన్ వారి నిర్వహణలో జరిగింది. ఈ నడక కార్యక్రమంలో ఈ పాఠ శాల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది, ఒమాన్ కేన్సర్ అసోసియేషన్ సిబ్బంది మరియు లైఫ్ లైన్ హాస్పిటల్ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిద్వారా చిన్నారులు -దయతో కూడిన ఏ చిన్న చర్య అయినా, ఎంతో మంది జీవితాలకు సహాయపడుతుందని తెలుసుకున్నారు. ఇక, 'క్లోతింగ్ డొనేషన్ వీక్' అనేది తాము చేపట్టబోయే తదుపరి కార్యక్రమమని సంబంధిత అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com