ఆల్కహాల్ సేవించడంప్రాణాంతకo !

- November 18, 2015 , by Maagulf
ఆల్కహాల్ సేవించడంప్రాణాంతకo !

ఆల్కహాల్ సేవించడం ఆనందంగా.. ఎంజాయ్ ఫుల్ గా ఉన్నప్పటికీ.. రాను రాను దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోలుకోలేని దెబ్బతీసే మత్తు పానీయ ఇది. ఈ వ్యసనానికి అలవాటు పడిన వాళ్లు మానేయడానికి చాలా ఇబ్బందిపడతారు. కొందరు అప్పుడప్పుడు ఆల్కహాల్ సేవించి ఎంజాయ్ చేస్తే.. మరికొందరు నిత్యం అదే అలవాటుగా మార్చుకుంటారు. దీనివల్ల శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలుగుతుంది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులకు అవకాశముంది. మద్యం తీసుకొనే ముందు తినాల్సినటువంటి ఆహారాలు ఒక్కసారి మద్యపానానికి అలవాటు పడ్డాక అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. ఇది శరీరంలోని ప్రతి అవయవం మీద దుష్ర్పభావం చూపుతుంది. మద్యం సేవించిన మొదట్లో ఎలాంటి ప్రభావం లేకపోయినా.. మెల్లమెల్లగా ఇది ఒక్కో అవయవంపై దుష్ర్పభావం చూపుతుంది. రెగ్యులర్ గా మద్యం తీసుకోవడం వల్ల చర్మం నుంచి గుండె వరకు ప్రతి ఆర్గాన్ కి కీడే. ఒక్కో అవయవంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. తక్కువ మోతాదులో అంటే ఒక గ్లాస్ వైన్ తీసుకుంటే గుండెకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు.. గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు చాలా వరకు ఆస్కారం ఉండదని తేల్చాయి. అయితే మోతాదుకి మించి తాగితే మాత్రం పెను ప్రమాదమే. ఇది హార్ట్ బీట్ పైనా ప్రభావం చూపుతుంది. రెగ్యులర్ గా ఎక్కువ మోతాదులో ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్లకు స్ర్టోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎక్కువ మద్యం సేవించడం వల్ల గుండె కండరాలకు కూడా ప్రమాదమే. బ్రీత్ ప్రాబ్లమ్స్, ఆయాసం, దగ్గుతో పాటు చాలా కొన్ని సందర్భాల్లో హార్ట్ ఫెయిల్యూర్ కి దారితీస్తాయి. ఆల్కహాల్ మెదడుపై ఆందోళన, సంతోషాన్ని ప్రేరిపిస్తాయి. ఎక్కువ మోతాదులో రెగ్యులర్ గా మద్యం సేవించడం వల్ల మెమరీ లాస్ కి దారితీస్తుంది. అంతేకాదు మెదడులోని నరాలపై ప్రభావం చూపి.. మూడ్ డిజార్డర్స్ కి, ప్రవర్తనలో మార్పులకు కారణమవుతాయి. దాంతో పాటు ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. మానవ శరీరంలో లివర్ అతిపెద్ద అవయవం. కాలేయంలో ఎలాంటి నొప్పి తెలిపే నరాలు కాలేయంలో ఉండవు. దీనివల్ల కాలేయంపై ఏదైనా ప్రభావం పడినా.. పరిస్థితి తీవ్రమయ్యే వరకు కనుక్కోవడం చాలా కష్టం. రెగ్యులర్ గా 3 లేదా 4 యూనిట్స్ కంటే ఎక్కువ మద్యం సేవిస్తే.. ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారితీస్తుంది. కాలేయ కణాలన్నీ కొవ్వుతో నిండిపోతాయి. అలసట, ఆయాసం వంటి లక్షణాలు ఫ్యాటీ లివర్ కి సంకేతాలు. ఎక్కువరోజులు ఆల్కహాల్ సేవిస్తూ ఉండటం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. మద్యపానం వల్ల కాలేయంపై ప్రభావం చూపుతుందని అందరికీ తెలుసు కానీ.. దీనివల్ల కిడ్నీలపైనా ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు. కిడ్నీల పనితీరుపై తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది. కిడ్నీలకు ఒత్తిడి పెరుగుతుంది. ఇది బీపీకి కూడా కారణమవుతుంది. రోజుకి రెండు కంటే ఎక్కువ ఆల్కహాల్ బివరేజెస్ తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కు కారణమవుతుంది. దీనివల్ల కిడ్నీల సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్స్ జరిగే ప్రమాదం ఉంది. సాధారణం కంటే ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారంటే.. పిత్తాశయంలో సమస్యలు ఉన్నాయని తెలుపుతాయి. కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఆల్కహాల్ డ్రింక్స్ అయిన బీర్, వైన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్ లో ఎసిడిటీ పెరిగి పిత్తాశయంపై ప్రభావం చూపుతాయి. ఇందులోని నరాలను నిస్సత్తువకు గురిచేస్తాయి. తీసుకునే ఆల్కహాల్ డైరెక్ట్ గా పొట్టలోకి వెళ్లి చేరుతుంది. దీనివల్ల గ్యాస్ర్టిక్ సమస్యలు, అల్సర్లు, ఇంటర్నల్ బ్లీడింగ్ కి కారణమవుతుంది. మద్యం కారణంగా పొట్ట క్యాన్సర్ కి అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది ప్యాంక్రియాస్. ఇది ఆహారాన్ని రసాలుగా మార్చి.. డైజెస్టివ్ హార్మోన్స్ ఇన్సులిన్ లాంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల ఈ ప్యాంక్రియాస్ పైన దుష్ర్పభావం చూపి, కణాల డ్యామేజ్ కి కారణమవుతుంది. మద్యం సేవించడం వల్ల చర్మంపైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. డీహైడ్రేట్, పొడిబారడం, పోషకాలు తగ్గిపోవడం వంటి రకరకాల చర్మ సమస్యలు కనిపిస్తాయి. చర్మంపై ముడతలు కూడా త్వరగా ఏర్పడతాయి. రెగ్యులర్ గా ఆల్కహాల్ సేవించడం వల్ల విటమిన్ ఏ తగ్గిపోతుంది. దీనివల్ల స్కిన్ డల్ గా కనిపిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com