'బెగ్గర్ ఫ్రీ సిటీ' కి సహకరించండి...రూ 500 పట్టండి
- January 04, 2018
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీ (యాచక రహిత నగరం)గా మార్చే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్లో మరో రెండు నెలలపాటు బిచ్చగాళ్లపై నిషేధం విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి మార్చి 8 వరకు యాచకులపై నిషేధం విధించినట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో బిచ్చగాళ్ల సమాచారమిచ్చిన వారికి రూ.500 పారితోషికం అందజేస్తామన్నారు. బిచ్చగాళ్ల సమాచారాన్ని 040 24511791, 040 24527846 నంబర్లకు తెలియజేయాలన్నారు. జంక్షన్లలో బిచ్చగాళ్లు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న దృష్ట్యా యాచకులను ఇప్పటికే చంచల్కూడ, చర్లపల్లి జైళ్ల ఆశ్రమాల్లో పెట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







